సారపాకలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
✍️ సారపాక – దివిటీ (ఏప్రిల్ 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ప్రధాన కూడలి వద్ద ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకుడు కంచేటి వెంకటేశ్వరరావు పూలమాలవేసి కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబునాయుడి 75వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీనియర్ నాయకుడు కాకర్ల సత్యనారాయణ టీడీపీ జెండా ఎగురవేశారు. మానం సుబ్బారావు, సునీల్, తెలుగు యువత నాయకుడు నెట్టెం భాస్కరరావు, టీడీపీ నాయకులు సింగమనేని శ్రీనివాసరావు, కుర్ర కృష్ణ, వెంకట్రావు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.