అనుమాస్పదస్థితిలో యువకుడి మృతి
✍️ ఖమ్మం – దివిటీ (జనవరి 9)
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ములుగుమాడు గ్రామంలో నీటితో నిండి ఉన్న క్వారీ గుంతలో గురువారం మధిర మండలానికి చెందిన ఒక యువకుడు అనుమానాస్పదస్థితిలో శవమై తేలాడు. స్థానికుల కథనం ప్రకారం… వివరాలిలా ఉన్నాయి. మధిర మండలం పరిధిలోని నాగవరప్పాడు గ్రామానికి చెందిన రామ లింగేశ్వరరావు(26 ) అనే యువకుడు క్వారీగుంతలో శవమై పడి ఉన్నాడు. ఆ ప్రాంతంలో పరిస్థితులు చూస్తే అతడి మరణంపై పలురకాల అనుమానాలు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడి మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.