Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHyderabadLife StyleSpot NewsTelanganaWomen

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

ఏసీబీకి చిక్కిన మైనారిటీ పాఠశాల ప్రిన్సిపల్

✍️ ఇల్లందు – దివిటీ (జనవరి 9)

మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలికి పెండింగ్ లో ఉన్న జీతం మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపల్ ను గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఫిర్యాదుదారు కథనం మేరకు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని మైనార్టీ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధిస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు.
ఆ డబ్బు కోసం పదిరోజులుగా ఇబ్బంది పెడుతుండటంతో సంధ్యారాణి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈమేరకు వలపన్నిన ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం ఆమె రూ.2వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం ఆ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా ప్రిన్సిపల్ అటెండర్ రామకృష్ణకు ఇవ్వమని చెప్పి పంపాడు. టీచర్ సంధ్యారాణి అటెండర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది. ఈ కేసులో ప్రిన్సిపల్, అటెండర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

Related posts

పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు

Divitimedia

వినియోగదారుల హక్కులను కాపాడాలి

Divitimedia

ఆహ్వానించేందుకు వచ్చానన్న కేఏ పాల్, అనుమతి లేదన్న పోలీసులు

Diviti Media News

Leave a Comment