Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsTelangana

జిల్లాలో 3న మంత్రి పొంగులేటి పర్యటన

జిల్లాలో 3న మంత్రి పొంగులేటి పర్యటన

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 2)

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం పర్యటించనన్నారు. ఆయన ఉదయం 9 గంటలకు సుజాతనగర్ లో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పాల్వంచ మండలంలో ప్రభాత్ నగర్, యానంబైలు నుంచి జిన్నెగట్ట రోడ్ లో హైలెవల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో ఎస్టీ ఆవాసాల అనుసంధాన బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చాతకొండ గ్రామంలో ఆరవ బెటాలియన్ ప్రవేశద్వారం నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు బీటీరోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ టెంపుల్ దగ్గర కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం, రైల్వేస్టేషన్ నుంచి ఎదురుగడ్డ వరకు రోడ్ విస్తరణ పనుల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంలో స్వయంసహాయక సంఘాలు నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టును కూడా మంత్రి సందర్శించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన వివరాలను జిల్లా అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Related posts

భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్

Divitimedia

ఐఎన్టీయూసీ గెలుపే కార్మికులకు బలం

Divitimedia

వర్షాకాలం సీజనుకు సన్నద్ధంగా ఉండాలి

Divitimedia

Leave a Comment