Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaYouth

గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 12)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ కోరారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశమందిరంలో గురువారం గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై ఆయన చీఫ్ సూపరింటెండెంట్లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు, లోకల్, జాయింట్ రూట్ అధికారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 15, 16తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు జిల్లాలో 38 పరీక్షకేంద్రాల్లో 13465మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కేవలం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష ప్రారంభానికి ముందే ఓఎంఆర్ షీట్ పై అక్కడి ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓఎంఆర్ షీట్లో అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులు వారి వివరాలను కేటాయించిన బ్లాకుల్లో తప్పుల్లేకుండా నమోదుచేసేలా చూడాలని తెలిపారు. పరీక్షకేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును సరిచూసుకోవాలన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపుపొందిన ప్రభుత్వ ఐడీకార్డును తప్పకుండా సరిచూడాలని తెలిపారు. నిర్దేశించిన రూట్లో మాత్రమే ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్స్ తీసుకు వెళ్లాలని, పకడ్బందీ పోలీస్ బందోబస్తు నిర్వహించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 9392919706, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన 040- 23542185, 040- 23542187 టోల్ ఫ్రీ నెంబర్లను ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రూప్ 2పరీక్షల కన్వీనర్ హరికృష్ణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ(గ్రూప్ 2 పరీక్షల పోలీస్ నోడల్ అధికారి), సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎట్టకేలకు గోతులు పూడ్పించిన అధికారులు

Divitimedia

‘సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి’

Divitimedia

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు ఎనిమిది మంది నామినేషన్లు

Divitimedia

Leave a Comment