ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాపోటీలు
విజేతలకు బహుమతులందించిన అధికారులు
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 11)
రెండురోజులపాటు ఉత్సాహంగా సాగిన బూర్గంపాడు మండలస్థాయి ‘సీఎం కప్ క్రీడాపోటీలు’ ముగిశాయి. బుధవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు రవీలాదేవి అధ్యక్షతన జరిగిన క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. మండల తహసిల్దార్ ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, ఎంఈఓ యధుసింహరాజు, ఎస్సై నాగభిక్షం చేతులమీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఎంపీడీఓ క్రీడాకారులను ఉత్సాపరిచారు. పీఈటీలు విద్యాసాగర్, యనమదల వేణుగోపాల్, జనార్ధన్, పూర్ణచంద్రరావు, హరికృష్ణ, రాము, కృష్ణ, తులసిరామ్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడాపోటీల విజేతల వివరాలు..
ఖోఖో బాలుర విభాగంలో కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ ప్రథమ, నకిరిపేట గ్రామ పంచాయతీ ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నాయి. వాలీబాల్ బాలుర విభాగంలో కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ ప్రథమ, సోంపల్లి గ్రామ పంచాయతీ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. కబడ్డీ బాలుర విభాగంలో బూర్గంపాడు గ్రామ పంచాయతీ ప్రథమ, అంజనాపురం గ్రామ పంచాయతీ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి.