Divitimedia
Andhra PradeshBusinessEducationHealthLife StyleSpot NewsTechnologyYouth

ఏపీ ప్రభుత్వం – గూగుల్ మధ్య కీలక ఒప్పందం

ఏపీ ప్రభుత్వం – గూగుల్ మధ్య కీలక ఒప్పందం

✍️ అమరావతి – దివిటీ (డిసెంబరు 5)

ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల సాధన కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంతోపాటు పలు స్టార్టప్స్, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఎఐ ఆధారిత సేవల కోసం గూగుల్ సంస్థ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలక అంశాల్లో ఎఐ, ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఎఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థికవృద్ధికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారం అందిస్తుంది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కూడా గూగుల్ సంస్థ సహకారం అందిస్తుంది. ఈ ఎంఓయు సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్, సీఎం కార్యాలయం కార్యదర్శి కార్తికేయమిశ్రా, ఎపీ ప్రభుత్వ ఇన్వెస్టిమెంట్స్ విభాగం ఉన్నతాధికారి యువరాజ్ పాల్గొన్నారు.

Related posts

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌కు

Divitimedia

ఎస్.హెచ్.జి. సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు

Divitimedia

సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు

Divitimedia

Leave a Comment