Divitimedia
HanamakondaHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaWarangal

త్రినగరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వరాలు

త్రినగరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వరాలు

నేడు వరంగల్ లో ప్రజా విజయోత్సవ వేడుకలు

✍️ హైదరాబాద్, వరంగల్ – దివిటీ (నవంబరు 19)

ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట నగరాల (ట్రై సిటీల) అభివృద్ధికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం వరంగల్ ఆభివృద్ధిపై దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయని, తెలంగాణలోనే రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఈ చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి తమ ప్రజాప్రభుత్వం నడుం బిగించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేడు (మంగళవారం) జరిగే ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.
వరంగల్ మహానగరం అబివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. ఆ వివరాలివి…

@ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ : రూ.4,170 కోట్లు.

@ మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ: రూ. 205 కోట్లు.

@ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : 160.92 కోట్లు.

@ టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, తదితర సదుపాయాలు : రూ.33.60 కోట్లు.

@ టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు : రూ. 43.15 కోట్లు.

@ కాళోజీ కళాక్షేత్రం : రూ.85 కోట్లు.

@ పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు : రూ. 65 కోట్లు.

@ నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం : రూ.8.3 కోట్లు.

@ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ నిర్మాణం : రూ. 32.50 కోట్లు.

@ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం : రూ.80 కోట్లు.

@ భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ : రూ.28 కోట్లు.

@ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు : రూ. 49.50 కోట్లు.

@ వరంగల్ ఉర్దూ భవన్, షాదీఖానా నిర్మాణాలు : 1.50 కోట్లు.

Related posts

ఊరచెరువును అభివృద్ధి చేస్తాం, అనుమతించండి

Divitimedia

ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని ఓడించాలి : కనకయ్య

Divitimedia

హాస్టల్ సమస్యలు చూసి ఆగ్రహించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment