19న ఉమ్మడి ఖమ్మంజిల్లా పాఠశాలల అండర్-14 టీటీ ఎంపికలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 17)
ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలోని అండర్-14 బాల బాలికల టేబుల్ టెన్నిస్ ఎంపికలు అక్టోబర్ 19వ తేదీ(శనివారం) ఉదయం 10గంటలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు సోమశేఖరశర్మ, వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతూ 2010 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటోతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్, స్టడీ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పైన పేర్కొన్న ధ్రువీకరణపత్రాలు తీసుకునిరాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపికలకు అనుమతించబడరని రెండు జిల్లాల పాఠశాలల క్రీడాకార్యదర్శులు వాసిరెడ్డి నరేష్ కుమార్, కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. రెండు జిల్లాలకు చెందిన పీఈటీలు, పీడీలు అందరూ ఈ నియమనిబంధనలు పాటిస్తూ క్రీడాకారులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని కోరారు. పూర్తి వివరాలకు
9951274678, 7989731339, 9848408335, 9949446551 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.