కలెక్టర్ ను కలిసిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఈఈ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 20)
టీజీఈడబ్ల్యుఐడీసీ ఖమ్మం నూతన ‘ఈఈ’గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పి.విన్సెంట్ రావు, సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఈఈ నుంచి డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈఈ విన్సెంట్ రావు వెంట కలెక్టర్ ను కలిసిన వారిలో ఏఈలు సత్యశ్రీనివాస్, దుర్గాశ్రీనివాస్, యూసిఫ్అలీ, రాంకుమార్, రాజగోపాల్, హెచ్.డి. సాంబశివరావు కూడా ఉన్నారు.