Divitimedia
Spot News

పదవీ స్వీకార ప్రమాణం చేసిన తెలంగాణ గవర్నర్

పదవీ స్వీకార ప్రమాణం చేసిన తెలంగాణ గవర్నర్

✍️ హైదరాబాదు – దివిటీ (జులై 31)

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ తో ఫొటో సెషన్ లో పాల్గొన్నారు.

Related posts

ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి

Divitimedia

అటవీప్రాంతంలో విత్తనాలు చల్లిన విద్యార్థులు

Divitimedia

కొత్త చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరం : ఎస్పీ

Divitimedia

Leave a Comment