Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaWomen

అమ్మ మాట – అంగన్వాడీ బాట ర్యాలీలు

అమ్మ మాట – అంగన్వాడీ బాట ర్యాలీలు

✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 15)

బూర్గంపాడు మండలంలో ‘అమ్మమాట- అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా గౌతంపురం, ఇరవెండి గ్రామాల్లో సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. గౌతంపురంస్కూల్ ఏరియా, ఇరవెండి గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో ‘ప్రిస్కూల్ విద్య’పై తల్లలకు ఆవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలను పూర్వ ప్రాథమికవిద్య కోసం అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ విధంగా ఆ పిల్లలకు విద్యాభ్యాసం అలవాటు చేయాలని తల్లలకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో బూర్గంపాడు సీడీపీఓ ప్రమీల, సూపర్ వైజర్ సక్కుబాయి, స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్లు జి.వెంకటరమణ, సీహెచ్.శ్రీదేవి, డి.మేరి, లలిత, డి.వి.రమణ, ఆశావర్కర్ భువనేశ్వరి, తల్లులు హజరయ్యారు.

Related posts

మహిళను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Divitimedia

అందరికీ మకరసంక్రాంతి శుభాకాంక్షలు

Divitimedia

నేడు జిల్లాలో ‘టెట్’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్

Divitimedia

Leave a Comment