2న మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన
సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింకు కాలువల సందర్శన
పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
✍️ ఖమ్మం – దివిటీ (జులై 1)
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు. మంత్రి ఉదయం 9:30 గంటలకు మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ – పాలేరు లింకు కాలువ పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. 10గంటలకు ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలో తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం చేరుకుని సీతారామ ప్రాజెక్ట్ – పాలేరు లింక్ కెనాల్, ఆకేరు జలధారను సందర్శిస్తారని ఆయన తెలిపారు. 11 గంటలకు దమ్మాయిగూడెంలో సొరంగ ప్రవేశ భాగాన్ని పరిశీలిస్తారని, 11:30గంటలకు బీరోలు కెనాల్ సొరంగ ఆడిట్ ను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కూసుమంచి మండలం పోచారం కెనాల్ సొరంగ నిష్క్రమణ భాగం, మధ్యాహ్నం 1:30 గంటలకు నర్సింహులగూడెం గ్రావిటీ కెనాల్ పరిశీలిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూసుమంచిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, నియోజకవర్గంలోని మండలాల అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. మంత్రి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.