దేశంలో వరద పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
✍️ న్యూఢిల్లీ – దివిటీ (జూన్ 23)
కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి అమిత్ షా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల పరిస్థితులు, సన్నద్ధత తీరుతెన్నులపై నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో ఆరంభమైంది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, హోంశాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి, పునరుద్ధరణ శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ, రోడ్డు రవాణా, హైవేస్ శాఖ, రైల్వేబోర్డు ఛైర్మన్, ఎన్.డి.ఎం.ఎ, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఐఎండీ డైరెక్టర్ జనరల్స్, సీడబ్ల్యుసీ, ఎన్.హెచ్.ఎ.ఐ ఛైర్మన్లు, పలువురు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.