మణుగూరు గిరిజన సంక్షేమ డిగ్రీకళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఆహ్వానం
✍️ భద్రాచలం – దివిటీ మీడియా (జూన్ 14)
మిట్టగూడెంలోని మణుగూరు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బాలురు) డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు స్పాట్ అడ్మిషన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ అనూష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు నేరుగా తమ కళాశాలలో సమర్పించాలని ఆమె కోరారు. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు తదుపరి మెరిట్ జాబితా ఈనెల 25వ తేదీన ప్రకటించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఇతర వివరాల కోసం 7901097698, 7989243996 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.