Divitimedia
Andhra PradeshBhadradri KothagudemCrime NewsHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNalgondaSpot NewsTelanganaWarangalWomenYouth

సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

మూడు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ రవిగుప్తా

పార్లమెంటు ఎన్నికల కోసం సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు

✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. డీజీపీ
హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా చర్ల మండలం పరిధిలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లిలోని పోలీసు భద్రతా బలగాల క్యాంపులను సందర్శించారు. ఆయనతోపాటు అడిషనల్ డీజీపీ (ఇంటిలిజెన్స్) శివధర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అడిషనల్ డీజీపీ రవిదీప్ సింగ్ సాహి, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారుసిన్హా, ఎస్ఐబీ ఐజీపీ సుమతి కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. క్యాంపుల సందర్శనలో భాగంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి డీజీపీ పలు సూచనలు చేశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని, అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పర్యటన తర్వాత హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసీ అతిథిగృహం చేరుకున్న డీజీపీ, అధికారుల బృందం అక్కడే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలతో ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్న డీజీపీ, పలు సూచనలు, ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమ నగదు, మద్యం రవాణా అడ్డుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకుని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీతో పాటు అధికారులందరూ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,ములుగు ఎస్పీ డా.శబరీష్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే, ఎస్ఐబీ ఎస్పీ రాజేష్, కొత్తగూడెం ఓఎస్డీ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ జితే, ట్రైనీ ఐపీఎస్ అధికారి విక్రాంత్ సింగ్, సీఆర్పీఎఫ్ అధికారులు ఆర్.కె పాండా, ఎం.కె మీనా, మోహన్, రితేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
‐————————–
డీజీపీకి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల
—————————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీసీ సారపాక అతిథిగృహం వద్ద కలెక్టర్, డీజీపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

Related posts

బూర్గంపాడులో సీపీఎం నాయకుల నిరసన

Divitimedia

సీఎం రేవంత్ ను ‘అలయ్ బలయ్’కు ఆహ్వానించిన ‘దత్తన్న’…

Divitimedia

పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్, అతిథిగృహం ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

Leave a Comment