Divitimedia
Bhadradri KothagudemCrime NewsEntertainmentHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaWomen

జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు

✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 7

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐడీఓసీ, జిల్లా పోలీసు కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురుషులతో సమానంగా ప్రతిభతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొని కొనియాడారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపి, మరింత చైతన్యం నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅలను రెవెన్యూ మహిళా అధికారులు, ఉద్యోగులు సత్కరించారు. మహిళా దినోత్సవవేడుకల్లో కలెక్టర్, ఎస్పీల సమక్షంలో కేక్స్ కట్ చేశారు. జిల్లాఎస్పీ రోహిత్ రాజు, జిల్లాలో పని చేస్తున్న మహిళా పోలీసు అధికారులు,సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తామని హామీనిచ్చారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ రత్నకుమారిని ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అధికారులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఐడీఓసీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ గన్యా, సిబ్బంది శకుంతల, రమాదేవి, హైందవి, పద్మ, సౌజన్య, స్వాతి,నవ్య, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు, కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి, షీటీం ఇంచార్జి ఆర్ ఎస్సై రమాదేవి, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయినులకు ఘన సన్మానం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది ఉపాధ్యాయినులకు ఘన సన్మానం చేశారు. ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ దయాల్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలు కొనియాడారు. సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టరేట్ లో ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకలు

Divitimedia

ఇళ్లమధ్యలో ‘చెరువులు’… మరెవరో బాధ్యులు…?

Divitimedia

ఎన్నికలకు ముందు INTUCలో భారీ చేరికలు

Divitimedia

Leave a Comment