Divitimedia
Spot News

“రోటరీ, ఆస్టర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అందరికీ ఉచిత ఆరోగ్యసేవలు”

“రోటరీ, ఆస్టర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అందరికీ ఉచిత ఆరోగ్యసేవలు”

ప్రారంభించిన రోటరీక్లబ్ గవర్నర్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి, ఆస్టర్ గ్రూప్ సీఈఓ డా.దేవానంద్

✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 25

తెలుగురాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా “ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం” ద్వారా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోటరీక్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-3150 సౌజన్యంతో సేవలు ప్రారంభించారు. భద్రాచలం ప్రాంతంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఈ “ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని” ఆదివారం రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, ఆస్టర్ గ్రూప్ హాస్పిటల్స్ చీఫ్ ఎగజిక్యూటివ్ డాక్టర్ దేవానంద్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గ్రామంలో నివసిస్తున్న దాదాపు 8000 మందికి వైద్యపరీక్షలు జరిపి, వారి ఆరోగ్యం శ్రేయస్సును నిర్ధారించి తగిన మందులు యివ్వడం జరుగుతుందని తెలిపారు. దశలవారీగా ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు వివరించారు. ప్రాథమికంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీలోని అన్ని కాలనీలకు చెందిన వారిని స్తానిక వాలంటీర్ల సహకారంతో ప్రతి వారం సర్వేల ద్వారా గుర్తించి, నెలవారీ సాధారణ వైద్యశిబిరాలలో గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులు, చరిత్రలపై ప్రాథమిక డేటా సేకరించబడుతుందని వారు తెలిపారు. సేకరించిన ఆ డేటా ప్రకారం 100 శాతం జబ్బులను గుర్తించి గ్రామస్తులలో అవసరం మేరకు డాటా విశ్లేషణ ద్వారా ట్రీట్‌మెంట్ ప్లాన్‌ లు రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలు, ప్రత్యేక క్యాంపులతో వ్యక్తుల ఆరోగ్యపరిస్థితి 100 శాతం మెరుగుదలతో గ్రామ ఆరోగ్యశుద్ధి భవిష్యత్ ఆరోగ్యసంరక్షణ వ్యూహాలకు కూడా ఉపయోగం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఆస్టర్ హాస్పిటల్స్ వివరాలు, పాటించే అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతికతల గురించి సీఈఓ డాక్టర్ కె.టి.దేవానంద్ వివరించారు. రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అవిభాజ్య గుంటూరు, ప్రకాశం రెవెన్యూ జిల్లాలలో 4500మంది సభ్యులు, 112క్లబ్బుల పరిధిలో తమ రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 నుంచి సేవలందిస్తున్నట్లు ఆ సంస్థ గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం ఆస్టర్ హెల్త్‌కేర్ యూనిట్ వారి సహకారంతో చేపట్టిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ప్రజలకెంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

Divitimedia

భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

Leave a Comment