Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StylePoliticsTelanganaWomen

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి : డిఐజి(ఎస్ఐబి) సుమతి

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి : డిఐజి(ఎస్ఐబి) సుమతి

జిల్లాలో పరిస్థితులపై పోలీస్ అధికారులతో సమీక్షించిన డిఐజి

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27

రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని డిఐజి(ఎస్ఐబి) బడుగుల సుమతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో ఆమె జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం నేరుగా హైదరాబాదు నుంచి ఐటీసీ అతిథిగృహానికి చేరుకున్న డిఐజికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న డిఐజి, జిల్లాలోని స్థితిగతులపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజును అడిగి తెలుసుకున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నిషేధిత మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేపట్టాలని తెలిపారు. సీఆర్పీఎఫ్ బలగాలతో సమన్వయం పాటిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎస్ఐబి ఎస్పీ బి.రాజేష్, సీఆర్పీఎఫ్ 81బెటాలియన్ కమాండెంట్ మనీష్ కుమార్ మీనా,141 కమాండెంట్ రితేష్ థాకూర్, కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ 151బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ అయోధ్యసింగ్, జిల్లాలోని డీఎస్పీలు వెంకటేష్, రాఘవేందర్రావు, రమణమూర్తి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబి) డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బడుగుల సుమతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఐజీ సుమతికి మొక్కను అందించి స్వాగతం పలికారు.

Related posts

రాష్ట్రంలో ‘డ్రగ్స్’ నిరోధానికి ఉక్కుపాదం : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

స్కూల్ గేమ్స్ జాతీయ క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల

Divitimedia

రేపట్నుంచి రాష్ట్ర ఫుట్ బాల్ జట్టు కోచింగ్ క్యాంప్

Divitimedia

Leave a Comment