Divitimedia
Bhadradri KothagudemEducationHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNalgondaNational NewsSuryapetTelangana

టీజీ సెట్-2024కు జనవరి 20లోపు దరఖాస్తు చేసుకోండి

టీజీ సెట్-2024కు జనవరి 20లోపు దరఖాస్తు చేసుకోండి

✍🏽 దివిటీ – భద్రాచలం (జనవరి 17)

తెలంగాణ సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ సెట్-2024కు దరఖాస్తులు కోరుతున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో 5వ తరగతిలో ప్రవేశాలకు, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 20తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా 100 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఈ ప్రవేశపరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అన్ని గురుకులాల్లో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి టి.వెంకటేశ్వరరాజు కోరారు.

Related posts

రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

Divitimedia

దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్

Divitimedia

యూపెస్సీ ర్యాంకర్ల ఆధ్వర్యంలో ‘స్పూర్తి’ కార్యక్రమం

Divitimedia

Leave a Comment