ఇది కదా నిజమైన సాంప్రదాయం… !
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భద్రాచలం రోడ్ పక్కన తాత్కాలిక డేరా వేసుకొని వుంటున్న ఒక నిరుపేద కుటుంబం సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోకుండా ఆచరిస్తున్న వైనమిది… సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గుడారం ముంగిట రంగుల ముగ్గు వేసి సంప్రదాయాలను పాటించడానికి పేదరికం అడ్డు కాదని, ఆడంబరాలే అవసరం లేదని చాటి చెప్తున్నారు. ఉన్నంతలో ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వీరు, తృప్తిగా బ్రతకడమే సంపూర్ణమైన జీవితమని స్పూర్తినిస్తున్నారు…
…. దివిటీ మీడియా, సాంస్కృతిక విభాగం