Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleTelanganaYouth

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 6)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు, బదిలీపై వెళ్తున్న ఎస్పీ డా.వినీత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
2018 బ్యాచ్ నకు చెందిన ఐపీఎస్ అధికారి రోహిత్ రాజు ఇప్పటి వరకు హైద్రాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా విధులు నిర్వర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బదిలీపై వచ్చారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా పనిచేస్తూ రోహిత్ రాజ్ పదోన్నతిపై గ్రేహౌండ్స్ ఏస్పీగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి 2023 నవంబరులో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులతో బదిలీపై వచ్చి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

Related posts

సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి

Divitimedia

19 నుంచి గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు

Divitimedia

అధికారం అండతో అడ్డగోలు నిర్మాణాలు…

Divitimedia

Leave a Comment