Divitimedia
Andhra PradeshHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaWomenYouth

లోకేష్ పాదయాత్రకు బ్రాహ్మిణి శుభాకాంక్షలు…

లోకేష్ పాదయాత్రకు బ్రాహ్మిణి శుభాకాంక్షలు…

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న పోస్ట్, రకరకాల కామెంట్లు

✍🏽 దివిటీ మీడియా – ఇంటర్నెట్ విభాగం

తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయినందున ఆయనకు శుభాకాంక్షలు అంటూ ఆయన సతీమణి బ్రాహ్మిణి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ మేరకు సోమవారం ఆమె ట్విట్టర్ ద్వారా తన భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పాదయాత్రకు శుభాకాంక్షలు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, ఇంత త్వరగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం రికార్డు సృష్టించినట్లేనని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇంకొందరైతే బ్రాహ్మిణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సూచిస్తున్నారు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని, వాహనాల మీద చేసే యాత్ర కాదని అంటూ కొందరు, ఇన్నిసార్లు బ్రేక్ లు తీసుకుని పాదయాత్ర చేశారని మరికొందరు వెటకారాలాడుతున్నారు. ఇలా రకరకాల కామెంట్లతో బ్రాహ్మిణి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Related posts

నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు

Divitimedia

వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు

Divitimedia

రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

Divitimedia

Leave a Comment