ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని ఓడించాలి : కనకయ్య
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని ఓడించాలని, బిజెపికి మద్ధతిచ్చే బీఆర్ఎస్, అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం సారపాక సీపీఎం కార్యాలయంలో పాపినేని సరోజిని అధ్యక్షతన జరిగిన పార్టీ బూర్గంపాడు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ జిల్లా కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బూర్గంపాడు మండల కమిటీ నిర్ణయం తీసుకుంది. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బి. నర్సారెడ్డి మాట్లాడుతూ సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయం ప్రకటించేదాకా మండల కమిటీ సభ్యులు, పార్టీ సానుభూతిపరులు, అభిమానులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, నాయకులు ఎస్కే అబిదా, పాండవుల రామనాథం, రాయల వెంకటేశ్వర్లు, భయ్యా రాము, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, కందుకూరి నాగేశ్వరావు, బర్ల తిరపతయ్య, తదితరులు పాల్గొన్నారు.