Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsTelangana

హైదరాబాదుకు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

హైదరాబాదుకు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

ఎస్సీల వర్గీకరణ లక్ష్యంగా హైదరాబాదులో శనివారం సాయంత్రం నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నుంచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు దీపంగి రామచంద్ర మాట్లాడుతూ, మాదిగల చిరకాల కోరిక ఎస్సీల వర్గీకరణ అంశంపై 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఎందరో మాదిగ నాయకులు తమ జీవితాలు ఫణంగా పెట్టి నిరాశ్రయులయ్యారన్నారు. అందుకే అస్తిత్వ పోరాటం కోసం దేశంలోని ఎన్నో ప్రాంతాలలో ఉన్న మేధావులు మాదిగలను తమ చెంతకు చేర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేపంగి రామచంద్ర మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాదుకు 5 బస్సులు, కార్లు, రైలు ఇతర మార్గాల్లో హైదరాబాదు వెళ్లారు.

Related posts

దాననకిషోర్ కు శుభాకాంక్షలు తెలిపిన యారం పిచ్చిరెడ్డి

Divitimedia

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షల శిబిరం

Divitimedia

ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం…

Divitimedia

Leave a Comment