మద్యం బెల్టుషాపుల నిర్వాహకులు 32మంది బైండోవర్
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శుక్రవారం బూర్గంపాడు మండలం పరిధిలో 32మంది మద్యం బెల్టు షాపుల నిర్వాహకులను బైండోవర్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు(బెల్టు షాపులు) కలిగి ఉన్నారని గుర్తించి వారిని తాము బైండోవర్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖాధికారులు ఈ సందర్భంగా తెలిపారు. వారిని తహసిల్దారు ఎదుట హాజరుపర్చి, ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున పూచీకత్తు తీసుకుని, రెండేళ్లదాకా బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై రత్నం, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.