Divitimedia
Bhadradri KothagudemHyderabadPoliticsTechnologyTelangana

ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలు కేటాయించిన కలెక్టర్

ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలు కేటాయించిన కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

ఎన్నికలసంఘం నియమావళి ప్రకారం జిల్లా పరిధిలోని నియోజకవర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ప్రియాంకఅల తెలిపారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ ద్వారా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ జిల్లాలో 1095పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు కూడా రిజర్వులో ఉండే విధంగా కేటాయించామన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ర్యాండమైజేషన్ పద్ధతి లో కేటాయించిన ఈవీఎంల జాబితా అన్ని రాజకీయపార్టీలకు అందజేసి ముట్టినట్లుగా రశీదు తీసుకోవాలని ఆమె ఎన్నికలవిభాగం పర్యవేక్షకులకు సూచించారు. ప్రాథమికంగా చెకింగ్ అనంతరం శనివారం నియోజకవర్గ కేంద్రాలకు పంపనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అన్ని నియోజకవర్గకేంద్రాల్లో రాజకీయపార్టీ ప్రతినిధుల సమక్షంలోనే అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూములలో ఆ ఈవీఎంలను భద్రపరచనున్నట్లు చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు రూ.40 లక్షలలోపే ఉండాలని ఎన్నికలసంఘం నిబంధన ఉందని, ఆ ఆదేశాల మేరకే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చులు లెక్కింపబడతాయన్నారు. ఖర్చుల వివరాలు రిజిష్టరులో నమోదులు చేయాలని, ప్రత్యేక వ్యయపర్యవేక్షకులు ఆ వివరాలు తనిఖీ చేస్తారని, ఏరోజు ఖర్చులు ఆరోజే నమోదులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. నామినేషన్ వేయడానికి కనీసం ఒకరోజు ముందుగానే ఏదైనా బ్యాంకులో ఎన్నికల ఖర్చుల నిర్వహణకు అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకుఖాతా ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల ఖర్చులన్నీ ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల కోసం బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి, లావాదేవీల నిర్వహణకోసం ఆ బ్యాంకుల్లో ప్రత్యేక సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలసంఘ నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూడు రోజుల్లో పింఛను దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి

Divitimedia

యూఆర్ఎస్’ను సందర్శించిన ఎంఈఓ

Divitimedia

ప్రభుత్వ పాఠశాల వార్షిక పర్యవేక్షణ

Divitimedia

Leave a Comment