బీఎస్పీ బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా పాయం సింగరాజు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బహుజన్ సమాజ్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా పాయం సింగరాజును ఎంపిక చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంపై నమ్మకంతో బహుజన రాజ్య స్థాపనలో భాగస్వామిని కావాలనే దృఢ సంకల్పంతో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సింగరాజు మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని, బీఎస్పీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలియజేశారు. తనకు అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు ఇర్ఫా రవికుమార్, ఉపాధ్యక్షుడు కె వి రమణ, ప్రధాన కార్యదర్శి గాడిద దామోదర్, సహచర జిల్లా నియోజకవర్గ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.