జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ జన్మదిన వేడుకలు
✍🏽 దివిటీ మీడియా – నల్లగొండ
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జన్మదిన వేడుకలు శనివారం జిల్లాకలెక్టర్ బంగళాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుంధతీయ మేధావుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంలో కలెక్టర్ ఎంతగానో ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు బాకీ యాదగిరి, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎల్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.