ఓటర్ల జాబితాలో అన్ని ప్రక్రియలు పూర్తి చేశాం : ప్రతీక్ జైన్
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
ఓటర్ల తుదిజాబితా ఈ అక్టోబర్ 4 నాటికి వెలువడుతున్నందు వల్ల తెలంగాణ రాష్ట్ర సీఈవో ఆదేశానుసారం పినపాక -110 ఎస్టీ నియోజకవర్గంలోని అన్నిమండలాల ఓటర్ల జాబితా సిద్ధం చేసినట్లు నియోజకవర్గం ఈ ఆర్ఓ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ గురువారం పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల తహసిల్దార్లు, సీఈఓ ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్, ఈఆర్ఓ ప్రత్యేక ఆదేశాలతో అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఫారం-6, 7, 8 లకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో చనిపోయి ఉన్న ఓటర్ల వివరాలు, నమోదు వివరాలు, పోలింగ్ స్టేషన్ల మార్పులు, దివ్యాంగులను ప్రత్యేకంగా ఓటర్ల జాబితాలలో మార్కింగ్, అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు, ఏర్పాట్లు చేయడం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓ రాఘవరెడ్డి ఎలక్షన్ సహాయకుడు రామ్ నాయక్ పాల్గొన్నారు.