Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsTravel And TourismYouth

ప్రయాణికుడికి రూ.10వేలు చెల్లించాలని మెట్రో రైలు యాజమాన్యానికి ఫోరం ఆదేశం

ప్రయాణికుడికి రూ.10వేలు చెల్లించాలని మెట్రో రైలు యాజమాన్యానికి ఫోరం ఆదేశం

✍🏽 దివిటీ మీడియా – ఖమ్మం

మెట్రో రైల్వేస్టేషన్ లో ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన రుసుము రూ.10, తిరిగి ఆ ప్రయాణికుడికి చెల్లించాలని, అసౌకర్యానికి గురిచేసినందుకు రూ.5వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.5వేలు చెల్లించాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ వి.లలిత, సభ్యులు ఎ.మాధవీలత తీర్పు ఇచ్చారు. ఈ కేసు ఫిర్యాదుదారు, ఖమ్మం జిల్లాకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు పనిమీద 2019 జనవరి 18వ తేదీన ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన ఎల్బీనగర్ మెట్రో రైల్వేస్టేషన్లో ఉదయం 10-15 గంటలకు మెట్రో రైలు ఎక్కేందుకు ఎలివేటర్‌ ద్వారా స్టేషన్ లో ప్రవేశించారు. మెట్రో రైలు ఎక్కేందుకు వెళ్లే తూర్పు వైపు దారిలో టాయిలెట్స్ లేకపోవడంతో,ఆయన పడమర వైపు ఉన్న వేరే దారిలో వెళ్లారు. దీని కోసం ఆయన మెట్రో రైల్వే జారీ చేసిన ట్రావెల్ కార్డ్ నెబ్యులా (నెంబర్ : 10100010225476)ను స్వైప్ చేయాల్సి వచ్చింది. టాయిలెట్ ఉపయోగించుకున్న తర్వాత ఫిర్యాదు దారుడు మళ్లీ అసలు మార్గానికి తిరిగి వచ్చారు. ఇందుకు మళ్లీ ట్రావెల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సి వచ్చింది. కేవలం టాయిలెట్ కు వెళ్లేందుకు ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్ నుంచి రూ.10 ఛార్జ్ చేశారు. ఫిర్యాదుదారుడు రైలు ఎక్కేందుకు లిఫ్ట్‌ ఎక్కే దారిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా వేరేవైపు వెళ్లి తిరిగి రావడం, అందుకు అదనంగా రూ.10 ఖర్చుచేయాల్సి రావడం వల్ల ఆయన దీని గురించి ఖమ్మం జిల్లా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో తనకు సంబంధం లేకుండానే రెండో వైపు మార్గంలో ఉన్న టాయిలెట్ కు వెళ్లడానికి కార్డు స్వైప్ చేయాల్సి వచ్చింది. వినియోగదారుని తప్పు లేకుండా ఆయన ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్ నుంచి రూ.10 ఛార్జ్ చేయబడింది. ప్రతిరోజూ ఇదే రీతిలో మెట్రో రైలులో పెద్దసంఖ్యలో ప్రయాణించే వారికి కూడా తనలాగే ఇదే నష్టం వాటిల్లుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్రో రైల్వేస్టేషన్ లో రెండువైపులా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకుండా ఆ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేవలం టాయిలెట్ కు వెళ్లేందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుం వసూలు చేయడం, అసమంజసం, అన్యాయంగా ఉందని ఫిర్యాదుదారుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా, స్టేషన్‌లోని ప్రతిమార్గంలో టాయిలెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించాలని, కనీసం సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని, మెట్రో రైలు ప్రయాణికులకు కనీసమైన సౌకర్యాలు కల్పించడం మెట్రో రైలు సంస్థకున్న ప్రదాన బాధ్యతగా పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఖమ్మంజిల్లా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణానంతరం
మెట్రో రైల్వేస్టేషన్ లో సరైన సౌకర్యాలు లేని కారణంగా బాధితుడు చెల్లించిన డబ్బులు తిరిగి ప్రయాణికుడికి చెల్లించాలని, మెట్రో రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం సూచికబోర్డులు ఏర్పాటుచేయాలని కోర్టు ఆదేశించింది. ఆదేశించింది. అదేవిధంగా ఆ ప్రయాణికుడికి జరిగిన అసౌకర్యానికి నష్ట పరిహారంగా రూ.5000, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.5,000 చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది. ఫిర్యాదుదారుడికి అయిన ఖర్చులతోపాటు, అసౌకర్యం కలిగించడం వల్ల వేదనకు గురిచేసినందుకు పరిహారంతో కలిపి రూ.10వేలు 45 రోజుల్లోపు అతనికి చెల్లించాలని ఖమ్మంజిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్ పర్సన్ వి.లలిత, సభ్యురాలు మాధవిలత తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఫిర్యాది తరపున న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, వీరన్న, కె.శరత్ బాబు వాదనలు వినిపించారు.

Related posts

జెన్కో సీఎండీ సంతకం ఫోర్జరీ చేసిన ఐటీసీ ఎంప్లాయ్

Divitimedia

స్ట్రాంగ్ రూం పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

Divitimedia

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

Divitimedia

Leave a Comment