Divitimedia
Bhadradri KothagudemLife StyleTechnologyTelangana

బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్మాణానికి భూమి కేటాయింపుపై కలెక్టర్ హామీ

బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్మాణానికి భూమి కేటాయింపుపై కలెక్టర్ హామీ

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

బీఎస్ఎన్ఎల్ ద్వారా జిల్లాలో సెల్ సిగ్నల్ కవరేజ్ లేని 32 గ్రామాలలో బీఎస్ఎన్ఎల్ 4జీ సెల్ టవర్స్ నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఐడీఓసీలో ఆమె బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెట్ వర్క్ లేని గ్రామాల్లో సెల్ టవర్ల నిర్మాణానికి గుర్తించిన గ్రామాల్లో 2 గుంటల భూమి టవర్స్ నిర్మించేందుకు కేటాయించాలని కలెక్టర్ ను బీఎస్ఎన్ఎల్ అధికారులు కోరారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అవసరమని, ప్రభుత్వసేవలు పొందేందుకున్న ప్రాధాన్యత బట్టి టవర్లనిర్మాణానికి భూమి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జిల్లాలో 26 గ్రామాల్లో రెవిన్యూ అధీనంలోని 2 గుంటల భూమిని కేటాయిస్తామని, మరో 6 గ్రామాలు వ్యవసాయశాఖ పరిధిలో ఉండడం వల్ల వ్యవసాయ అధికారులతో మాట్లాడి త్వరలో భూమి కేటాయింపునకు చర్యలు తీసుకుంటామనని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.వి.రవీంద్రనాధ్,
బీఎస్ఎన్ఎల్ డీజీఎం నవీన, ఏజీఎం శ్రీనివాసరావు, ఎస్డీఈ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుస్సేన్ సాగర్ లో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

Divitimedia

అదానీతో జగన్ హయాంలో జరిగిన ఒప్పందం రద్దు చేయాలి

Divitimedia

నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

Divitimedia

Leave a Comment