ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
✍🏽 దివిటీ మీడియా – సారపాక
వినాయకచవితి ఉత్సవాలను పర్యావరణ హితం చేయడంలో భాగంగా సారపాకలోని ఐటీసీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యలో సోమవారం మట్టి వినాయకుడి విగ్రహాలు ఉచితంగా పంపిణీచేశారు. ఐటీసీ కాలనీతోపాటు సారపాకలో కూడా ప్రత్యేక స్టాల్స్ (రెండు) ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్ పీడీ సారపాక యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకవిగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్ మాట్లాడుతూ, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, సెక్రెటరీ కె.వి.ఎస్ గోవిందరావు, రోటరీక్లబ్ సభ్యులు సమంత ప్రఫుల్, శివరాంకృష్ణన్, నాగ మల్లేశ్వరరావు, ఆశిష్, విజయ్ కుమార్, సాయిరాం, ప్రతాప్, డి.వి.ఎం నాయుడు, బసప్ప రమేష్, సత్యనారాయణ, మహేష్ రెడ్డి, దిలీప్, రమణ, రోటరాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ నీలి మురళి, సర్బరిష్, చైతన్య, వెన్స్లస్, విద్యవాణి, పలువురు రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు.