బ్రిలియంట్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
✍🏽 దివిటీ మీడియా – సారపాక
సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థలలో కిడ్స్ ప్లేస్కూల్లో చిన్నారులతో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. బ్రిలియంట్స్ ఉపాధ్యాయులతో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి.
కార్యక్రమంలో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో చూపరులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బ్రిలియంట్స్ విద్యాసంస్థల అధినేత బి నాగేశ్వరరావు, అమ్మవారికి పూలమాలలు అలంకరించి, సాంప్రదాయబద్ధంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో నేటి కాలంలో విద్యార్థుల్లో దైవత్వం భావన నింపడం మనందరి బాధ్యతన్నారు. మన దేశ సంప్రదాయాలను పిల్లలకు గుర్తుచేసేలా నిర్వహించే ఇలాంటి ఉత్సవాలు వారికెంతో ఉత్సాహాన్నిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోటాపోటీగా ఉట్టికొట్టి అలరించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహం నడుమ ఆనందించారు.