“బేసిక్ లైఫ్ సపోర్ట్” గురించి వైద్య విద్యార్థులకు శిక్షణ
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
“బేసిక్ లైఫ్ సపోర్ట్” అంశంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాలలో విద్యార్థులకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో శనివారం శిక్షణ అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు, అమెరికన్ హార్ట్ ఆసోసియేషన్ ధ్రువీకరణ పొందిన (సర్టిఫైడ్) ట్రైనర్ డాక్టర్.మోటూరు ధరణీంద్ర, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డా. షుకూర్ విద్యార్థులకు వివరించారు. గుండె పోటు, ఇతర అత్యవసర వ్యాధులు సంభ వించినప్పుడు రోగిని ఆసుపత్రికి తరలించే ముందు అత్యవసరంగా అదజేయవలసిన వైద్యపరమైన విషయాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా,”మానిక్విన్” పై కూడా శిక్షణ ఇచ్చారు.ఇటువంటి శిక్షణ పొందిన వారు అత్యవసర సమయంలో వైద్యం అందుబాటులో లేని వారికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ కోనేరు కోటేశ్వరరావు మాట్లడుతూ, సామాజిక బాధ్యతగా తమ హాస్పిటల్ ఎండీ డాక్టర్. పోతినేని రమేష్ బాబు సంకల్పం మేరకు ఇప్పటి వరకు లక్షమందికి పైగా విద్యార్థులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజా సంఘాలు, సేవా సంఘాల ఆధ్వర్యంలో ఎవరికైనా ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని, శిక్షణ అవసరం అయిన వారు 9848172652 నంబర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్.ఆర్.ఎల్.లక్ష్మణరావు మాట్లాడుతూ, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కాలేజీలో ఉన్న 180 మంది వైద్య విద్యార్థులకు “బేసిక్, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్”లో శిక్షణ ఇచ్చిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్.అల్లూరి నాగరాజు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.