సీయం ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి గడువు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు) విద్యార్ధులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం (సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్) కోసం ధరఖాస్తులు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పథకం కింద ఆర్థికసాయం పొందేందుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్, వైద్య విద్యలో పీజీ కోర్సులలో విదేశాల్లోని విశ్వ విద్యాలయాల్లో అడ్మిషన్ పొంది ఉండాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు గల విద్యార్థులు ద్రువపత్రాలతో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వరకు దరఖాస్తు చేసు కోవాలని, అర్హత గల మైనారిటీ విద్యార్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసిన ప్రతులను జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఋ జిరాక్సు ప్రతులను అందచేయాలని చెప్పారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్ధులకు 20 లక్షల రూపాయలు, విమాన ప్రయాణ ఖర్చులు క్రింద 60 వేలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. కావున అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటి విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగరచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, జి 12, మొదటి అంతస్తు లో సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు.