Divitimedia
Crime NewsNational NewsSpot News

మిజోరంలో రైల్వే బ్రిడ్జి కూలిపోయి 18 మంది కార్మికులు మృతి

మిజోరంలో రైల్వే బ్రిడ్జి కూలిపోయి 18 మంది కార్మికులు మృతి

శిథిలాల కింద చిక్కుకుపోయి పలువురి గల్లంతు

✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్

మిజోరం రాష్ట్రంలోని సైరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన ఒకటి కూలిపోయిన దుర్ఘటనలో బుధవారం (ఆగస్టు 23వ తేది) 18 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఐజ్వాల్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో బుధవారం ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 35నుంచి 40మంది కార్మికులు ఉండటంతో ఇంకా చాలా మంది ఆ ప్రదేశంలో చిక్కుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల నుంచి మధ్యాహ్నం వరకు పదిహేడుమంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని, ఇంకా చాలామంది కనిపించడం లేదని, వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు. కాగా ఘటనాస్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఈ దుర్ఘటనపై సమాచారం అందుకుని స్పందిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ప్రకటించారు. మిజోరంలో బ్రిడ్జి ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొందని పేర్కొంటూ, ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతి చెందిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల చొప్పున మరణించినవారి కుటుంబాలకు అందించి, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున అంద జేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా మాట్లాడుతూ, ఈ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, సహాయక చర్యల (రెస్క్యూ ఆపరేషన్‌)లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, “మిజోరం రాష్ట్రం లో జరిగిన దురదృష్టకర సంఘటనతో తానెంతో బాధపడినట్లు ప్రకటించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, మిజోరం రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు సంఘటనా స్థలంలోనే ఉన్నారని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఈ ఘటనలో మృతులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

Related posts

గోదావరిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

Divitimedia

క్యాలెండర్ ఆవిష్కరించిన గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్

Divitimedia

ఏజెన్సీ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment