Divitimedia
HyderabadLife StyleSpecial ArticlesTelangana

కీలకమైన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్

కీలకమైన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొట్టమొదటి ఎక్కువ పొడవైన స్టీల్ బ్రిడ్జి హైదరాబాదులో ప్రారంభానికి సిద్ధమైంది.
ఎస్‌ఆర్‌డీపీలో చేపట్టిన 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ ఇండస్ట్రీస్ వరకు ఈ స్టీల్‌బ్రిడ్జిని నిర్మించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల నాటి ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి చేపట్టిన చర్యలు కార్యరూపం దాల్చాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జిని శనివారం (ఆగస్టు 19న)
ప్రారంభిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) కింద నిర్మించింది. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేసిన దివంగత నాయిని నరసింహారెడ్డి పేరు ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నాయిని నర్సింహారెడ్డి, కొన్ని దశాబ్దాలుగా వీఎస్టీ పరిశ్రమలో వర్కర్స్ యూనియన్‌కు నాయకత్వం వహించారు. ఈ బ్రిడ్జిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు.

Related posts

“తగ్గేదెలే…” మేడమ్ టుస్సాడ్స్ సెల్ఫీతో అల్లు అర్జున్ హంగామా

Divitimedia

Divitimedia

గుండాల, కరకగూడెం, ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

Leave a Comment