విధులలో మరణించిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కుటుంబాలకు అండగా ఉంటాం
సమస్యలు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో హోంగార్డు ఆఫీసర్స్ గా పనిచేస్తూ సర్వీసులో ఉండగానే వివిధ అనారోగ్య సమస్యలు, రోడ్డుప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ తెలిపారు. జిల్లాలో రకరకాల కారణాలతో మరణించిన హోంగార్డు ఆఫీసర్స్ కుటుంబ సభ్యులను ఎస్పీ కార్యాలయానికి పిలిచి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలు కనుక్కుని పిల్లల చదువుకి సంబందించిన వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరణించిన హోంగార్డ్ ఆఫీసర్స్ కుటుంబాలకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా తమను స్వయంగా వచ్చి సంప్రదించవచ్చని తెలియయజేశారు. ఈ సందర్బంగా తమను గుర్తించి సమస్యల గురించి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎస్పీ డాక్టర్ వినీత్ కు, మరణించిన హోంగార్డ్ ఆఫీసర్స్ కుటుంబసభ్యలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(ఏఆర్) ఇ.విజయబాబు, హోంగార్డ్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఒ సుధాకరరావు, జిల్లా హోంగార్డ్స్ అసోసియేన్ అధ్యక్షుడు వి సత్యనారాయణ, అసోసియేన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.